జనగామ : జిల్లాలోని పాలకుర్తి సబ్ డివిజన్ పరిధిలో మిషన్ భగీరథలో ( Mission Bhagiratha) డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కునమల్ల సంధ్యారాణి ( Kunamalla Sandhyarani ) లంచం( Bribe) తీసుకుంటూ పట్టుబడ్డారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో ఆమెను ఏబీసీ అధికారులు పట్టుకున్నారు.
దేవురుప్పుల మండలంలో వేసిన పైప్లైన్లకు మేజర్మెంట్ చేసి ఫైనల్ బిల్లు కోసం బాధితుడు డీఈఈని సంప్రదించాడు. అయితే ఆమె లంచం డిమాండ్ చేయడంతో డీఈఈ నియమించుకున్న ప్రైవేట్ సహాయకుడు మహేందర్‌కు బాధితుడు ఫోన్ పే ద్వారా రూ.10 వేలను పంపించాడు.
వెంటనే ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడి చేసి ప్రైవేట్ వ్యక్తిని, డీఈఈ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటి ఆధారంగా ఇద్దరిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న డీఈఈని వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.