హనుమకొండ, మే 12 : కాం గ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో అమలుకు పొంతన లేకుండా పో యింది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండాల్సి న ‘చేయూత’ పథకం జాడ కనిపించడం లేదు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్ డబ్బుల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. సర్కారు అధికారంలోకి వచ్చి 27నెలలు అవుతున్నా ఆసరా పింఛన్ల పెంపుపై అ డుగు ముందుకు పడలేదు. పెంచిన పింఛన్లు రాక, కొత్తవి మం జూరు కాక వేలాది మంది లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పెండింగ్‌లో ఉన్న వేల దరఖాస్తులే ప్రభుత్వ జాప్యానికి నిదర్శనంగా కనిపిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 8,536 మంది అర్హులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్‌గా ఇచ్చే పింఛన్ల విషయంలో గత ప్రభు త్వం ప్రతినెలా మొదటి వారంలో ఠంచన్‌గా పంపిణీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న ప్రభు త్వం హామీలు అమలు చేయడంలో మాత్రం విఫలమైందని మండిపడుతున్నారు.
కొత్తవి ఇవ్వదు.. పాతవి పెంచదు..
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు చేయడం లేదు.. ఉన్నవారికి పెంచడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ ఒకేసారి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 27 నెలల నుంచి ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని విమర్శలున్నాయి. కొత్త పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఎవరైనా చనిపోతే వారి పింఛన్లు నిలిపివేస్తున్నారే తప్ప, కొత్తగా ఎవరికీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,01,203 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు 37,303 మంది, వితంతువులు 35,874, దివ్యాంగులు 13,311, కల్లుగీత 2,761, చేనేత కార్మికులు 1,822, బీడీ వర్కర్లు 3,469, ఒంటరి మహిళలు 2,558, ఎయిడ్స్ బాధితులు 3,449, పైలేరియా 517, డయాలసిస్ 166 మంది ఉండగా, వీరందరికీ కలిపి ప్రతి నెలా రూ. 23,99,74,496 పంపిణీ చేస్తున్నారు.
మండలం : లబ్ధిదారులు
ఆత్మకూర్ : 429
భీమదేవరపలి : 808
దామెర : 453
ధర్మసాగర్ : 477
ఎల్కతుర్తి : 676
హసన్‌పర్తి : 319
ఐనవోలు : 391
కమలాపుర్ : 611
నడికూడా : 508
పర్కాల (మున్సిపల్) : 233
పర్కాల : 230
శాయంపేట : 223
వేలేర్ : 313
వరంగల్ (మున్సిపల్) : 2865
మొత్తం : 8,536