సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువులకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ అవార్డులు అందజేసి వారి సేవలను కొనియాడారు.
అలాగే పలువురు టీచర్లు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు అందుకున్నారు. అవార్డు అందుకున్న వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బిశెట్టి కవిత, ఉపాధ్యాయులు కే ధనలక్ష్మి, సీహెచ్ కృష్ణ, అసిస్టెంట్ లెక్చరర్ వై భీమానాయక్ ఉన్నారు.