ఇలాంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?
ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పల్లగుట్ట క్రాస్‌రోడ్ వద్ద రూ.25 లక్షలతో ఏర్పాటు చేయనున్న చేపల మార్కెట్‌కు
- ఎనిమిదేళ్లలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా?
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 5 : ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పల్లగుట్ట క్రాస్‌రోడ్ వద్ద రూ.25 లక్షలతో ఏర్పాటు చేయనున్న చేపల మార్కెట్‌కు ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్‌తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలారు. అలాగే గొర్రెలో పుర్రు వ్యాధి నివారణ కోసం టీపీఆర్ వ్యాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి తలసాని మాట్లాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని ఉంటే చూపించాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. తెలంగాణ రాక ముందు ఇక్కడి ప్రజలకు 24గంటల కరెంటు ఇస్తామంటే ఎవరన్నా వద్దన్నారా, సాగునీరు ఇస్తామంటే వద్దన్నారా, ఉద్యోగాలు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 2016 రూపాయల పెన్షన్ వంటి పథకాలను మీరు ఇస్తామంటే ఎవరన్నా వద్దన్నారా అని ప్రశ్నించారు. మత్స్య పారిశ్రామిక సంఘం వారికి రూ.10 లక్షలు ఇచ్చి ఇదే ప్రపంచం అని చెప్పిన సందర్భాలను మనందరం చూశామని అప్పుడు రిజర్వాయర్లలో సరిపడా నీరుండకపోయేదని ఇప్పు డు 365 రోజులు నీళ్లు ఎలా ఉంటున్నాయో గమనించాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రేషన్ దుకాణానికి వచ్చి మోదీ ఫొటో పెట్టాలనడం ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

