ఏసు జన్మించిన శుభ దినమే క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం. అందుకే నేటి పర్వదినాన్ని ఆనందోత్సాహాల నడుమ ఉత్సవంలా జరుపుకునేందుకు క్రైస్తవులు సిద్ధమ య్యారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చిలను ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీ పాలతో అలంకరించారు.
హనుమకొండలోని సీబీసీ, కాజీపేటలోని ఫాతిమా, వడ్డేపల్లిలోని సె యింట్ పీటర్స్, రూథర్‌ఫర్డ్, జనగామలోని కేథలిక్, ఉండ్రుపుర, మహబూబాబాద్‌లోని బిలి వర్స్, సీఎస్ఐ, యేసుపాదం, డోర్నకల్‌లోని సీఎస్ఐ, వరంగల్ గొర్రెకుంట క్రాస్ సమీపంలోని మన్నా, లేబర్‌కాలనీలోని సీబీసీ, చింతల్ైప్లెఓవర్ బ్రిడ్జి సమీపంలోని సీఎస్ఐ, దేశాయిపేటలోని సీఎస్ఐ సెయింట్ మాథ్యూస్ చర్చి, తదితర ప్రార్థనా మందిరాల్లో అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
– ఫొటోగ్రాఫర్లు, వరంగల్/మహబూబాబాద్/జనగామ