డబ్బుల్ భారం!
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ‘మీ సేవ’ ద్వారా అందిస్తున్న సేవలు మరింత భారం కానున్నా యి. ఇప్పటికే పొందుతు న్న వివిధ ధ్రువపత్రా లు, సర్టిఫికెట్లు, సేవ ల కోసం ప్రజలు చెల్లిస్తున్న ఫీజులతో పాటు కేంద్రాల నిర్వాహకులు అదనంగా వసూళ్లకు పాల్పడుతుండడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు.
- రెండింతలు పెరిగిన ‘మీ సేవ’ చార్జీలు
- ఉమ్మడి జిల్లాలో 615 కేంద్రాలు
- ప్రజలపై అదనపు వ్యయం
హనుమకొండ, ఏప్రిల్ 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ‘మీ సేవ’ ద్వారా అందిస్తున్న సేవలు మరింత భారం కానున్నా యి. ఇప్పటికే పొందుతు న్న వివిధ ధ్రువపత్రా లు, సర్టిఫికెట్లు, సేవ ల కోసం ప్రజలు చెల్లిస్తున్న ఫీజులతో పాటు కేంద్రాల నిర్వాహకులు అదనంగా వసూళ్లకు పాల్పడుతుండడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం యూజర్ చార్జీలు (ఫీజులు) రెండింతలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వ చ్చింది. సర్కారు నిర్ణయంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండింతలు పెరిగిన చార్జీలు
మీ సేవ కేంద్రాల యూజర్ చార్జీలు రెం డింతలు పెరిగాయి. ప్రభుత్వం నిర్ణయంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నా రు. ఆన్లైన్ సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 615 మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో హనుమకొండ జిల్లాలో117, వరంగల్లో 140, జయశంకర్ భూపాలపల్లిలో 97, ములుగు లో 51, మహబూబాబాద్లో 135, జనగామ జిల్లాలో 75 కేంద్రాలున్నాయి. ఏ కేటగిరీ దరఖాస్తులకు గతంలో రూ. 35 ఉండగా, ప్రస్తుతం 18 శాతం జీఎస్టీతో క లుపుకొని రూ. 62కు చేరింది. బీ కేటగిరీ దరఖాస్తులకు రూ.45 ఉండగా రూ.80కి చేరింది. కాగా, ధ్రువపత్రాల మంజూరు కో సం అప్లోడ్ చేసేందుకు నాలుగు పేజీలు ఉచితంగా చేసేవారు.
అంతకు మించి చేస్తే పేజీకి రూ.2 చొప్పున వసూలు చేసే చార్జీని ప్రస్తుతం రూ.2.50కి పెంచారు. బిల్లులకు సంబంధించిన రుసుం మూడు రకాలుగా ఉన్నది. ఇందులో రూ.20 ఉన్న దానిని రూ.35, రూ.25 ఉన్న దానిని రూ. 44కు, రూ.30 ఉన్న దానిని రూ. 53కు పెంచారు. అలాగే విద్యుత్ బిల్లుల చెల్లింపునకు సం బంధించి రూ. ఒకటి నుంచి రూ. 200 వర కు ఉన్న యూజర్ చార్జీలను రూ. 2 నుంచి రూ. 4కు, రూ. 201 నుంచి రూ.1000 వరకు ఉన్న చార్జీలను రూ.5 నుంచి రూ.9కి, రూ.1,001 నుంచి రూ.2,500 వరకు ఉంటే రూ.10 నుంచి రూ. 18కు, రూ.2,500 కన్న ఎక్కువగా ఉంటే రూ.25 నుంచి రూ. 44కు పెంచారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

