వరంగల్ చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎంజీఎంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వాహనం దిగిన వెంటనే ఆయన పర్సంటేజీల ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ నినదించారు. మీడియాను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డా.లక్ష్మణ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేయించారు.
పరీక్షల అనంతరం ఎంజీఎం వైద్యులు పోలీసులకు రిపోర్టులు అందజేయడంతో పోలీసులు కౌశిక్ రెడ్డిన అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇంతలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలను అడ్డుతప్పించిన పోలీసులు కౌశిక్ రెడ్డిని పోలీస్ వాహనంలో ఎంజీఎం నుంచి తీసుకెళ్లారు.