సంగెం, మార్చి 14 : వరంగల్ జిల్లా సంగం మండలంలో హోలీ పండుగ రోజున విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పాలేటి పాడు గ్రామానికి చెందిన కోయ బంగారు బాబు (34) బతుకుదెరువు కోసం వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో తాపీ మేస్త్రిగా(Mason dies) పనులు చేస్తున్నాడు.
శుక్రవారం పనుల మీద తిమ్మాపురం గ్రామం వెళ్లి బైక్పై తిరిగి సంగెంకు వస్తున్న క్రమంలో సంగెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బొలెరో వాహనం బైకును ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన బంగారు బాబును ఎంజీఎం దవాఖానకు తరలించే లోపు మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంగారు బాబు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.