తొర్రూరు/పర్వతగిరి, మే : పార్లమెంట్లో మన హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్ శుక్రవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వరంగల్ జిల్లా పర్వతగిరిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివచ్చి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఉద్యమ నాయకుడు సుధీర్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేసి మోసపోయామని ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలను అమలుచేశారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, దేవుళ్లపై ఒట్లు పెడుతూ మరోసారి నయవంచన చేసి ఓట్లు దండుకోవాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. 30 నుంచి 50వేల మెజార్టీతో అభ్యర్థి సుధీర్‌కుమార్ గెలుపు తథ్యమని, అన్ని సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 15వేల మెజార్టీ ఖాయమని ప్రకటించారు. అభ్యర్థి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఆడుగుజాడల్లో తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో గళమెత్తుతానన్నారు. మోసపూరిత కాంగ్రెస్, తెలంగాణకు ఏ మాత్రం సహకరించని బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పార్టీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి సుధీర్‌కుమార్ నిఖార్సయిన తెలంగాణవాది అని, ఆయనకు ప్రజలు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీలు మంగళపల్లి శ్రీనివాస్, జ్యోతిర్మయి సుధీర్, డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు, బిల్లా సుధీర్‌రెడ్డి, పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, అనిమిరెడ్డి, రంగు కుమార్, రామచంద్రయ్యశర్మ, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, కుర్ర శ్రీనివాస్, నలమాస ప్రమోద్, జైసింగ్‌నాయక్, పర్వతగిరి ఎంపీపీ కమలా పంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జితేందర్‌రెడ్డి, ఎం భిక్షపతి, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యుగేంధర్‌రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.