ములుగు, మే31 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఎస్పీ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్-మహారాష్ట్రలకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారికి ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలి పారు.
లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యుడు దొర్పెట్టి మిర్గు, ఏరియా కమిటీ సభ్యురాలు మడవి టిడో, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం భీమాతోపాటు పార్టీ సభ్యులు ఉయిక అనిత, మడకం కమలేశ్, సోయం భీమే, మడవి మడక, మదవి ఇడుమలు ఉన్నట్లు తెలిపారు. అజ్ఞా తంలో ఉన్న మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్ ఉన్నారు.