బచ్చన్నపేట ఏప్రిల్ 14 : మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్134 జయంతిని విగ్రహ ప్రతిష్టాపన కమీటి అధ్యక్షులు కంత్రి సత్తయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశాడన్నారు. రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని, ఆయన కృషి కారణంగానే ప్రపంచంలో భారతదేశం బలమైన ప్రజాస్వామ్యం దేశంగా ఆవిర్భవించిందని అన్నారు.
న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా పేరొందారన్నారు. అంటరాని కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడితేనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వాధించిన మహానీయుడు అంబేద్కర్ అని తెలిపారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని భావించిన తొలి వ్యక్తి అంబేద్కరన్నారు. అంబేద్కర్ ముందు చూపు వల్లే నేడు అణగారిన వర్గాలు గౌరవ ప్రదమైన జీవనం సాగిస్తున్నాయన్నారు. అంబేద్కర్ జీవితం ఉద్యమాలకు, సాంఘిక సంస్కరణలకు ఊపిరిపోసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్వాల రాజు, మాల మహానాడు విద్యార్థి నాయకులు, మల్యాల అఖిల్ మాల, తమ్ముడి మహేందర్, స్వరాజ్, బుడగ జంగాల మండల అధ్యక్షులు సిరిపాటి రాందాస్, చింతల కర్ణాకర్, పంచాయతీ సెక్రెటరీ నరసింహ చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నల్లగొని బాలకిషన్ గౌడ్, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, టిడిపి రాష్ట్ర నాయకులు అల్లాదుర్గం వెంకటేష్, జిల్లా సందీప్, గుర్రం బాలరాజు, అల్వాల స్వామి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొమ్మర్ల వేణు వందనం, బుర్ర బాలమణి, యాదగిరి, తురక్కపల్లి శ్రీనివాస్, కిష్టయ్య, అలవాల రమేష్, కర్ర నరేష్, మట్టి బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.