సీరోలు(కురవి)/మరిపెడ, డిసెంబర్ 15 : కాంగ్రెస్ సర్కారు సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, రెండేళ్ల పాలనలో ఒక్క పథకం అ మలు చేయలేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సీరోలు మండలం చింతపల్లి, కురవి మండలం పెద్ద తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోరుతూ సోమవారం ప్రచారం నిర్వహించారు. అదేవిధం గా మరిపెడ మండలంలోని గుర్రప్ప తం డాకు చెం దిన సుమారు 200 కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా, వారికి మాజీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకున్నోళ్లు వినమ్రతతో, విజ్ఞతతో పదిమంది మెచ్చుకునేలా మాట్లాడాలన్నారు. చింతపల్లి గ్రాస్తులు చాలా విజ్ఞులని, ఇప్పుడే అభి వృద్ధి గురించి అడిగిన అయ్యప్ప మాల ధరించిన సొంత పార్టీ నాయకుడిని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్‌నాయక్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం విచారకరమన్నారు. ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబితేనే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తుంటారన్నారు.
మాయమాటలు నమ్మి మోసపోయామని, రాబోయే రోజులు బీఆర్ఎస్దేనని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరా రు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగలి న ర్సయ్య, నాయకులు భోజ్యానాయక్, ధరావత్ వీరన్న, మామిండ్ల వెంకన్న, హత్తిరామ్, గుగులోత్ శ్రీరామ్, విజయ్, రాందాస్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో గ్రామ అధ్యక్షుడు హ లావత్ తిరుపతి, రంజిత్, స్వామి, బిచ్చలి, నరేశ్, కిషన్, జరుపుల సురేశ్, మాలోత్ మంజ్యా, బానోత్ బిచ్చు, బానోత్ బాలు, బానోత్ చిన్న బిచ్చ, హలావత్ మంగ్యి, యుగేంధర్, ప్రభాకర్, బాలు, బలరాం, మోతీ రాం, భీమ, శ్రీనివాస్, సిరి, రాజారాం ఉన్నారు.