మహదేవపూర్, (కాటారం), అక్టోబర్ 28 : గ్యారెంటీ, వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి మోసపోవద్దని, నమ్మితో మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే చీకటి, అది ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ చీకట్లు తప్పా వెలుగు ఉండవన్నారు. కర్ణాటకలో ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తేనే మన బతుకులు బాగుపడతాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొవరతోనే అభివృద్ధి సాధ్యమైందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజలకు వివరించాలని సూచించారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేశ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా బీఆర్ఎస్ మ్యనిఫెస్టో రూపొందించారని, యువత పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మండలంలోని చిదినేపల్లి, పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు సుమారు 200 మంది బీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై బీఆర్ఎస్ లో చేరినట్లు వారు పేర్కొన్నారు. పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తోట జనార్దన్, సర్పంచ్ తోట రాధమ్మ, మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్యరెడ్డి, సీనియర్ నాయకుడు కర్రు నాగయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కుడుదుల రాజబాపు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు భూపెల్లి రాజు, మండల యూత్ అధ్యక్షుడు రామిల్ల కిరణ్, ప్రధాన కార్యదర్శి జోడు శ్రీనివాస్, పలిమెల మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, ఎంపీటీసీలు రాజమణి, బాసాని రవి, ఎల్లయ్య, సోషల్ మీడియా ఇన్చార్జి వంగళ రాజేంద్రచారి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పంతకాని సడవలి, మాజీ సింగిల్ విండో చైర్మన్ తుల్సగరి శంకరయ్య, నాయకులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాదే
మల్హర్: ఎన్నికలు వచ్చాయంటే కాంగ్రెసోళ్లు నోట్లు పంచుడు తప్పా ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని, అలాంటి వారి మాటలను నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి జడ్పీచైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మండలంలోని తాడిచర్లలో నిర్వహించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక మందికి సాయం, సేవ కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 300 మంది యువకులు పుట్ట మధు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, సింగిల్ వింవో చైర్మన్ మల్క ప్రకాశ్‌రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోనె శ్రీనివాస్‌రావు, సర్పంచులు సత్తయ్య, రమేశ్, ఎంపీటీసీ రావుల కల్పనా మొగిళి, నాయకులు కే రవి, తాజుద్దిన్, యాదగిరిరావు, బీరాజయ్య, అయూబ్‌ఖాన్, హరీశ్, రాజేశ్వరరావు, సదానందం, మల్లేశ్, సమ్మయ్య, రవి పాల్గొన్నారు.