హనుమకొండ చౌరస్తా, జూన్ 1: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం విడ్డూరమని పిఆర్టియుటిఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతి రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వమిచ్చిన రేషనలైజేషన్ నిబంధనలు ప్రాథమిక విద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని, 60 మంది పిల్లల వరకు ఇద్దరు టీచర్లు అని నిబంధనలు విధించడం పూర్తి అసమంజసం అన్యాయమన్నారు. ఈ ఉత్తర్వులను సవరించి 30 మంది వరకు విద్యార్థులకు ముగ్గురు టీచర్లు, 60 మంది వరకు ఐదుగురు టీచర్లు ప్రాథమిక పాఠశాలలో ఉండాలి.
అప్పుడే ప్రాథమిక విద్యావ్యవస్థ పటిష్టమై ఉన్నత పాఠశాలకు వచ్చే విద్యార్థులు నాణ్యమైన ప్రమాణాలతో వస్తారని తెలిపారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం ఉండాలని, ప్రతి ప్రాథమిక పాఠశా లలో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేసి ఆ సంఖ్యను కూడా సర్దుబాటు నిబంధనలోకి పరిగణలోకి తీసుకో వాలన్నారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున తదుపరి ఉపాధ్యా యుల సర్దుబాటు చేయాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు జూనియర్ ఉపాధ్యాయున్నీ సర్ప్లస్ చూపించాలని ఉంది.
కావున ఉత్తర్వులను సవరించి సీనియర్ ఉపాధ్యాయునికి మొదటగా ప్రాధాన్యం ఇవ్వాలని లేని పక్షంలో జూనియర్ ఉపాధ్యాయుడు తప్పకుండా వెళ్ళే విధంగా సవరణ చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన బడిబాటను ప్రస్తుతం నడుస్తున్న తల్లిదండ్రుల మోటివేషన్ను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా గత సంవత్సరం విద్యార్థుల సంఖ్యను ఆధారంగా ఆగమేఘాల మీద రేషనలైజేన్ ప్రకటించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడమే అవుతుందననారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఈ సర్దుబాటు ఉత్తర్వులను మార్పు చేయాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు.