కరీమాబాద్ మార్చి 4 : మామునూరు ఎయిర్పోర్ట్(Mamunur Airport) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన బాటపట్టారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి గ్రామాల రైతులు మంగళవారం నక్కలపల్లి- గుంటూరుపల్లి మధ్యన ధర్నా చేపట్టారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులు కోరారు. రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామని స్పష్టం చేశారు.
సరైన పరిహారం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వే అనుమతిస్తామంటున్నారు. గతంలో భూమికి భూమి ఇస్తామని ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.