INAVOLU | హనుమకొండ (ఐనవోలు): ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం దినదిన ప్రవర్ధమానం చెందుతొంది. అతి పురాతనమైన చాలా పవిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి సాక్షమే ఈ సమకూరిన ఆదాయం. ఈ నెల 4 నుంచి 29 వరకు అంటే 25 రోజులకు గాను హుండీ, వివిధ రకాల టిక్కట్ల ద్వారా సమకూరిన ఆదాయమే నిదర్శనం.
దేవస్థానం ఆదాయం రోజుకు గాను రూ. 4 లక్షల 89 వేల 22 సమాకూరింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా సుమారుగా రోజుకు రూ.4.89 లక్షల ఆదాయం సమకూరిదంటే ఆలయాని భక్తుల తాకిడి ఏ స్థాయిలో పెరిగిందో అర్థం అవుతున్నది. కాగా ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం, టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయంను శనివారం ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు.
25 రోజులకు గాను 23 హుండీలను తెరిచి లెక్కించగా రూ.25 లక్షల 96 వేల, 561 వచ్చినట్లు వెల్లడించారు. వివిధ రకాల టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.96 లక్షల 29 వేలు సమకూరినట్లు పేర్కొన్నారు. హుండీ, టిక్కెట్ల ద్వారా దేవాలయానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.1 కోటి 22 లక్షల 25 వేల 561 వచ్చినట్లు ఈవో ప్రకటించారు.
ఈ లెక్కింపునకు పరిశీలకులుగా డీ అనిల్ కుమార్, ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు, కానిస్టేబుల్స్ జి పరమేశ్వరి, యాస్మిన్, శ్రీనివాస్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్, అర్చకులు, సిబ్బంది కిరణ్, శ్రీకాంత్, కన్నయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.