తొర్రూరు, జూన్ 9 : తొర్రూరు మండలం హరిపిరాల శివారులోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 2021లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.200 కోట్లతో శంకుస్థాపన చేశారు. దీంతోపాటు చుట్టు పకల మండలాలు, గ్రామాల రైతులకు అందుబాటులో ఉండేలా ఆయిల్‌పామ్ నర్సరీని కూడా ప్రారంభించారు. అయితే, ఆయిల్‌పామ్ నర్స రీ పెంపకంలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర క్ష్యం కారణంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. నాసిరకం విత్తనాలు, మట్టి, ఎరువులు వినియోగించడం వల్ల మొకలు సరిగా ఎదగక ఎండిపోతున్నాయని, సకాలంలో మొకలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు.
నర్సరీలో అవసరమైన సంఖ్యలో కూలీలను నియమించకపోవడం, నీటి సౌకర్యం సరిగా లేకపోవడం, ఎరువుల నిర్వహణలో లోపాల కారణంగా పెద్దఎత్తున మొకలు దెబ్బతింటున్నాయని రైతులు తెలిపారు. విత్తనాలు గణనీయమైన సంఖ్యలో మొలకెత్తకపోవడంతోపాటు ఇప్పటికే పెరిగిన మొకల్లో కూడా భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. దిగుమతి చేసిన విత్తనాల్లో సుమారు 40 శాతం వరకు మొలకెత్తలేదన్నారు. మట్టి సరఫరాలో అక్రమాలు జరిగాయని, నాణ్యత లే ని మట్టి, ఎరువులతో మొకలు పెంచుతున్నారని ఆరోపించారు. నర్సరీల్లో జరుగుతున్న అవకతవకల వల్ల ఆయిల్‌పామ్ సాగుపై తమ విశ్వాసం దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు స్పందించి నర్సరీలో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
మండలంలోని ఆయిల్ పామ్ నర్సరీలో పనిచేస్తున్న కూలీలకు తగిన వేతనాలు చెల్లించకుండా అధికారులు, కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని కూలీలు, రైతులు ఆరోపిస్తున్నారు. నర్సరీలో మూడు షె డ్లు ఏర్పాటు చేయగా, ఒకో షెడ్డుకు ఎనిమిది మంది చొప్పున మొత్తం 24 మంది కూలీలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 11 మందితో నే పనులు చేయించుకుంటున్నట్లు పేరొంటున్నారు. నెలకు ఒకో కూలీకి రూ.15వేల వర కు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.9వేలే ఇస్తున్నారని కూలీలు వాపోతున్నారు.
రోజుకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మట్టిలో కష్టపడి పనిచేసిన కూలీలకు రూ.450 చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 300 మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. మిగిలిన రూ.150 అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై దోచుకుంటున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. ప్రతి నెలా సుమారు రూ.లక్షా 50వేలు కూలీలకు రావాల్సిన సొమ్ము మళ్లించబడుతోందని కూలీలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల కాలంలో ఆయిల్‌పామ్ నర్సరీలో మొ త్తం 35,280 మంది కూలీలు పనిచేసినట్లు పేరొంటూ, వారి కూలి డబ్బుల నుంచి సు మారు రూ.52 లక్షలకు పైగా అక్రమంగా దం బడుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నా యి. కూలీల శ్రమను దోచుకుంటూ రూ.లక్ష లు సంపాదిస్తున్న అధికారుల, కాంట్రాక్టర్లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూలీలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించేలా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
మండలంలోని గోపాలగిరి ఆయిల్‌పామ్ నర్సరీలో 2022 నుంచి ఇప్పటివరకు 2,336 మంది రైతులకు 5.49 లక్షల ఆయిల్‌పామ్ మొకలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పంపిణీకి సిద్ధంగా ఉండాల్సిన మొకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు సమాచారం. థాయ్‌లాండ్, కోస్టారికా నుంచి దిగుమతి చేసిన 2.5 లక్షల విత్తనాల్లో సుమారు 40 శాతం మొలకెత్తకపోవడంతో మొకల ఉత్పత్తి దెబ్బతిన్నట్లు అధికారులు పేరొన్నారు. అలాగే, నర్సరీలో మొకలకు కావాల్సిన మట్టిని కాంట్రాక్టర్ ములుగు జిల్లా అడవి మల్లంపల్లి నుంచి తీసుకురావాలి కానీ, తొర్రూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరిపి ఒక ట్రిప్‌నకు రూ.1800చొప్పున నాసిరకం మట్టిని వేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు కాంట్రాక్టర్, అధికారులు కుమ్మకై దండుకుంటున్నారు. విత్తనాలు, నాణ్యతలేని మట్టి వినియోగం కారణంగా మొకల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నది. దీంతో రైతులు ఆయిల్‌పామ్ సాగుపై చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్‌పామ్ నర్సరీలో జరిగిన వ్యవహారాలపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
నేను గత మూడు సంవత్సరాలుగా నర్సరీలో కూలీగా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు పనికి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు మట్టిలోనే కష్టపడుతున్నాం. మొక్క లు నాటడం, మట్టి మోయడం వంటి భారమైన పనులు చేస్తున్నా రోజుకు కేవలం రూ.300 మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం ఒకో కూలీకి రూ.450 చెల్లిస్తున్న విషయం మాకు ఇప్పటివరకు తెలియదు. ఎండలో కష్టపడి పని చేస్తున్న మా దగ్గర నుంచి అధికారులు అక్రమంగా డబ్బులు తీసుకోవడం సరికాదు. ఇప్పటి వరకు నాకు రూ.లక్ష 50వేల రూపాయలు రావాలి. ఎంత బరువైన మట్టినైనా మోస్తూ నర్సరీ పనులు చేస్తున్నాం. మా శ్రమకు తగిన వేతనం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి కూలీ డబ్బులు మాకు
– తలారీ ప్రమీల, నర్సరీలో కూలీ