మడికొండలో జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సీవోఈ కళాశాలలో గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్,
- నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
- హాజరుకానున్న 240 మంది విద్యార్థులు, 120 మంది గైడ్ టీచర్లు
మడికొండ, డిసెంబర్ 10 : మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సీవోఈ కళాశాలలో గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎనర్జీ రీసోర్స్ అండ్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అండ్ కన్సర్న్స్, నేచురల్ రిసోర్స్ అండ్ దేర్ కన్జర్వేషన్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనే ఆరు అంశాలపై విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. జోన్-2లోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి 60 గురుకులాల విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. ఒక్కో గురుకులం నుంచి రెండు అంశాలతో నలుగురు చొప్పున మొత్తం 240 మంది విద్యార్థులు, 120 మంది గైడ్ టీచర్లు హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే బాలబాలికలకు వేర్వేరుగా క్యాంపస్‌ను ఏర్పాటు చేసి వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఇప్పటికే తమ ఎగ్జిబిట్లతో విద్యార్థులు ప్రదర్శన కేంద్రానికి చేరుకున్నారు. రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రదర్శనకు హాజరయ్యే బాల బాలికలకు ఇబ్బందులు తలెత్తకుండా వేర్వేరుగా వసతి కల్పించాం. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ఎగ్జిబిట్ల ద్వారా ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవానికి పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరుకానున్నారు.
– దాసరి ఉమామహేశ్వరి, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

