డోర్నకల్, డిసెంబర్ 14 : చాప్‌ల తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి బాగుందని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్ ప్రశంసించారు. సర్పంచ్ బానోత్ పాండు నాయక్, ఎంపీడీవో అపర్ణ, ఎంపీవో మీర్జా మున్వర్ బేగ్, కార్యదర్శి సంపత్‌ను అభినందించారు. బుధవారం మోడల్ విలేజ్ అయిన చాప్లతండా జీపీలో గ్రంథాలయం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. దాతల సహకారంతో గ్రంథాలయం కోసం పుస్తకాలు సేకరించాలని సూచించారు. క్రీడా ప్రాంగణంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, టెన్నిస్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సర్పంచ్ పాండు నాయక్, అధికారులు, పాలక వర్గ సభ్యులను సన్మానిస్తామన్నారు. జిల్లాలో చాప్‌ల తండా జీపీ ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అపర్ణ, సర్పంచ్ పాండు నాయక్, ఎంపీవో మీర్జా మున్వర్ బేగ్, ఎస్బీఎం రవి కుమార్,ఉప సర్పంచ్ మోహన్, కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీని సుందరీకరించుకోవాలి
మున్సిపాలిటీని సుందరీకరించుకోవాలని జేసీ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని సెంట్రర్ లైటింగ్, ఏసీ బీసీ కాలనీ వద్ద ఫౌంటెన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మైనార్టీ షాదీఖాన, బతుకమ్మ చెరువు వద్ద పార్కును పరిశీలించారు. మున్సిపాలిటీలో పనులు జాప్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పబ్లిక్ హెల్త్ డీఈ నవీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. వారం రోజుల్లో పనుల ప్రోగ్రెస్ చూపించాలన్నారు. బతుకమ్మ చెరువు వద్ద ఉన్న పార్కులో వాకింగ్ ట్రాక్ మరమ్మతు, ఓపెన్ జిమ్ త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాల్ పారిశుధ్య సిబ్బంది తమ వేతనాలు పెంచాలని జేసీకి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వీ వీరన్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కే కోటిలింగం, మున్సిపల్ మేనేజర్ ఉదయ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ అహ్మద్, కౌన్సిలర్ పోటు జనార్దన్, డీఈ నవీన్, ఏఈ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.