కురవి : కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో భక్తజన సందోహంలో జ్వాలా తోరణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాకారం నిండుగా దీపాలను వెలిగించారు. ప్రతి కార్తీక పౌర్ణమికి మాత్రమే రాణి ఏకశిల స్థంబంపై పూజారులు దీపాన్ని వెలిగించారు. ఆలయ పరిసరాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెయ్యి దీప దండెం వద్ద వేదపండితులు పూజలు చేశారు. అనంతరం భక్తులచే జ్వాలాతోరణాన్ని ముట్టించారు.
అనంతరం భక్తులు జ్వాలాతోరణం కింద నుంచి మూడు పర్యాయాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జరిగే జ్వాలాతోరణానికి విశిష్ట ప్రాధాన్యత ఉందని వేదపండితులు వివరించారు. కార్తీక మాసంలో నిర్వహించే జ్వాలాతోరణం కింద నుంచి వెల్లే భక్తులకు సకల పాపాలు హరించునని వివరించారు.