కురవి : భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక కళా పోటీలలో కురవి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి జక్కుల విష్ణు మొదటి బహుమతి సాధించినట్లు పాఠశాల హెచ్ఎం వహిద్ తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో విష్ణును అధ్యాపక బృందం అభినందించారు. జక్కుల విష్ణుకు వందేమాతరం పాటకు జాతీయ గీతాల విభాగంలో మొదటి బహుమతి, మట్టితల్లికి దండంపెట్టాలి అనే గీతానికి ప్రాంతీయ భాష విభాగంలో మొదటి బహుమతి సాధించినట్లు హెచ్ఎం తెలిపారు.
విద్యార్థితోపాటు విద్యార్థికి కోచింగ్ ఇచ్చిన స్వప్న, గిరిజ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బొందిలి వెంకన్న, దామోదర్, భిక్షపతి, శ్రీధర్, నరసింహచారి, విజయలక్ష్మీ, స్వర్ణ, ఉదయమ్మ తదితరులు పాల్గొన్నారు.