మహబూబాబాద్ : పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. సోమవారం కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి, సర్వపురం తండా, పెద్దమోరి తండా, రంగపురం గ్రామంలో ఆసరా పెన్షన్ కార్డులు, ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ..ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్ర మోహన్, జెడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.