
మహబూబ్‌నగర్, ఆగస్టు 8 : పాలమూరు అభివృద్ధిపై బహిరంగంగా చర్చిద్దామని సోషల్ మీడియా, ఓ చానల్లో ప్రచారం చేసినవారు చర్చకు రాకుండా ఎక్కడున్నారని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. పాలమూరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఆదివారం ఉదయం 10:30 గంటలకు జిల్లాకేంద్రంలోని నేషనల్ ఫంక్షన్‌హాల్‌కు రావాలని ఇటీవల సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. దీనిపై టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించి నేషనల్ ఫంక్షన్‌హాల్‌కు వచ్చా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్‌చైర్మన్ కోరమోని వెంకటయ్య, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రాజేశ్వర్, కాడం ఆంజనేయులు మాట్లాడా రు. టీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ అభివృద్ధి దిశ గా పరుగులు పెడుతుంటే కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రచారం చేసి ఒక్కరూ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. మ రోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కరుణాకర్‌గౌడ్, జంబులయ్య, మల్లు నర్సింహారెడ్డి, కృష్ణయ్యగౌడ్, రామలిం గం, కొండా లక్ష్మయ్య, శ్రీకాంత్‌గౌడ్, షబ్బీర్‌అలీ, బాలరా జు, వడ్ల శేఖర్, హన్మంతు, మోసిన్, కట్టా రవికిషన్‌రెడ్డి, అం జద్, మునీర్, ఉమర్‌పాషా, చిన్నా, నవకాంత్, గోవింద్, ఆనంద్‌కుమార్‌గౌడ్, తిరుపతిరెడ్డి, సుదీప్‌రెడ్డి ఉన్నారు.