కాళేశ్వరంలో ‘మహా’ సందడి
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచే కాళేశ్వరం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం 10 గంట లకు మంగళ వాయిద్యాలతో దీపారాధన, గణపతి పూ జ, స్వస్తి పుణ్యాహచనం, రక్షా బంధనం నిర్వహించా రు.
- శివరాత్రికి ముందే పోటెత్తిన భక్తులు
- కాళేశ్వర-ముక్తీశ్వర స్వామికి ఘనంగా ఊరేగింపు, ఎదుర్కోలు
- నేటి సాయంత్రం శివ పార్వతుల కల్యాణం
- శని త్రయోదశికి ఏర్పాట్లు పూర్తి
కాళేశ్వరం, ఫిబ్రవరి17: మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచే కాళేశ్వరం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం 10 గంట లకు మంగళ వాయిద్యాలతో దీపారాధన, గణపతి పూ జ, స్వస్తి పుణ్యాహచనం, రక్షా బంధనం నిర్వహించా రు. కల్యాణ మండపంలో జరుగుతున్న పూజల్లో అర్చ కులు కృష్ణముర్తి శర్మ, నగేష్ శర్మతో పాటు 11 మంది కి ఈవో మహేశ్ మహా శివరాత్రి దీక్షా వస్ర్తాలను అంద జేశారు. 11 గంటలకు దేవతాహ్వానం, నవ కలశారాధ న, నవగ్రహారాధన, 11.30 గంటలకు మండప దేవ తారాధన, వృషభద్వజ పటాధివాసం చేశారు. సా యంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠ తదితర పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే గోదావరి లో స్నానాలు ఆచరించి నదీ మాతకు ప్రత్యేక పూజలు చే శారు. అనంతరం ఆలయంలో స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకం చేశారు. కాగా శుక్రవారం అర్చకులు స్వామి వారికి నిత్య పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మమతా నాగరాజు దంపతులు, సర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి బంగారు కిరీటం, వడ్డానం అలంకరణ
మహా శివరాత్రి సందర్బంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలోని పార్వతీ అమ్మవారికి సీఎం కేసీ ఆర్ బహూకరించిన బంగారు కిరీటం, ఏఎమ్మార్ కంపెనీ ఎండీ మహేశ్వర్ రెడ్డి దంపతులు అందించిన బంగారు వడ్డానాన్ని ఈవో అర్చకులకు అందజేయగా శుక్రవారం ఉదయం అలంకరించారు.
స్వామి వారికి ఎదుర్కోలు
కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి రాత్రి 8 గంటలకు ఊరేగింపు, ఎదుర్కోలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై ఊరేగించగా, మహిళలు హా రతులు ఇచ్చారు.
నేటి సాయంత్రం కల్యాణం
శనివారం సాయంత్రం 4 గంటలకు శివ పార్వతు ల కల్యాణ మహోత్సవానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. మహా శివరాత్రి రోజునే శని త్రయోదశి రావడంతో ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. శని పూజలు ఉదయం 7 నుంచి 12 గంటల వరకు భక్తులు పూజలు చేయనున్నారు. ఇందు కోసం ఆల యం నుంచి ఆరుగురు అర్చకులను కేటాయించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

