కాజీపేట, అక్టోబర్ 8: దేశంలో అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై మతోన్మాది న్యాయవాది రాజేష్ కిషోర్ అనే మతోన్మాదిని కఠినంగా శిక్షించాలని హనుమకొండ జిల్లా రైతు సంఘం జిల్లాకార్యదర్శి ఏం చుక్కయ్య డిమాండ్ చేశారు. కాజీపేట మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సిజెఐ గవాయి పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చుక్కయ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటాని కి పూలమాలలు వేసి, పలు నినాదాలు చేశారు.
అనంతరం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిజేఐ బిఆర్ గవాయి పై జరిగిన దాడి దేశ విద్రోహ చర్యగా ఆయన అభివర్ణించారు .ప్రపంచ దేశాల ముందు ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కించపరిచే చర్యగా చేశారన్నారు. సిజెఐ పై జరిగిన దాడి ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, భారతదేశం ఆయు పట్టైన భారత రాజ్యాంగం పై దాడి అన్నారు. సనాతన ముసుగులో మతోన్మా దాన్ని పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ లాంటి ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలన్నారు.
ఆర్ఎస్ఎస్, బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా నిలబడిన కల్బుర్గి, గౌరీ లంకేష్, పన్సారే ఇలాంటి మేఘాలను నిర్దాక్షంగా హత్య గావించిందని, వికలాంగుడైన సాయిబాబాను దేశద్రోహం కేసు నమోదు చేసి జైలులో బంధించి ఆయన చావుకు కారణమైంద అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కారు ఉపేందర్, వెంకట స్వామి, సుధాకర్, రవీందర్, రమేష్, శ్రీనివాస్, యోగేష్, వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు జంపాల రమేష్, రైతు సంఘం నాయకులు చంటి రవి, కట్టయ్య, కెవిపిఎస్ నాయకులు దశరధ రావు, రాము, రమేష్, శీను, పోచయ్య, ఐద్వా నాయకులు రాయల రమ, సరోజన, యశోద, తదితరులు పాల్గొన్నారు.