హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 15: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్బీ 3, 5 సంవత్సరాల కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు వైస్ ఛాన్సలర్ కె. ప్రతాప్ రెడ్డికి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఒకే ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం ఏడాది వృథా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఉస్మానియా, శాతవాహన విశ్వవిద్యాలయాలు ఇప్పటికే లా కోర్సులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం యూజీ కోర్సులకు (బీఏ, బీకాం) ఇప్పటికే ఇలాంటి పరీక్షలు ప్రకటించిందన్నారు. విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనివ వెంటనే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరిక్షలు నిర్వహించాలని కోరారు.వినతి పత్రం అందజేసిన వారిలో విద్యార్థులు సత్యనారాయణ రెడ్డి ఎర్ర, సుధాకర్ గాదె, గౌరీశంకర్, కృష్ణ చైతన్య, నిజాముద్దీన్, గజ్జి దయాకర్, అభిలాష్, సుష్మా, పవన్, శ్రవణ్ ఉన్నారు.