గీసుగొండ, జనవరి 13 : కంటి చూపును కాపాడుకుందామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కోనాయిమాకుల రైతు వేదికలో శుక్రవారం రెండో విడుత ‘కంటి వెలుగు’ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మండలంలోని ప్రతి గ్రామంలో గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచించారు.
అవసరమైన వారికి అద్దాల పంపిణీతో పాటు ఆపరేషన్ కూడా చేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కంటి సమస్యలు ఉండకూడదనే అలోచనతో సీఎం కేసీఆర్ రూ. 250 కోట్లతో కంటి వెలుగు ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఏమైనా సమస్యలుంటే అధికారులు తన దృష్టికి తీసుకోరావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కంటి వెలుగు ప్రత్యేకాధికారి డాక్టర్ పద్మశ్రీ, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీడీవో రమేశ్, వైద్యాధికారి మాధవీలత, సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్‌లు రాధాబాయి, కవిత, బోడకుంట్ల ప్రకాశ్, మల్లారెడ్డి, జైపాల్‌రెడ్డి, బాబు, వీరాటి కవిత, అంగోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండలో కాంగ్రెస్ ఖాళీ..
గీసుగొండ : మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నదని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో విపక్షాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన గట్టు రాజు, రవి, సమ్మయ్య, సంపత్, అశోక్, రాజు, కుమారస్వామి, నారాయణతో పాటు మరో 25 మంది కాంగ్రెస్ నాయకులు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మహేందర్, లక్ష్మణ్, సమ్మయ్య, ప్రవీణ్, రాజు, నరేశ్, యాకయ్య, జయపాల్‌రెడ్డి, చంద్రు, కుమారస్వామి, అనిల్, స్వామి ఉన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ నాగయ్య, నాయకులు రవీందర్‌రెడ్డి, కొండం కుమారస్వామి, లెనిన్‌గౌడ్, రాజ్‌కుమార్, రజినీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.