నమస్తే నెట్వర్క్, ఆగస్టు8: రెండు రోజుల క్రితం జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవా ద దంపతులపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లాయర్లు విధులు బహిషరించి తమ నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన సీఐ, ఎస్సై, సిబ్బందిపై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో కోర్టు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఎర్రబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. పరకాల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డీవో నారాయణకు వినతి పత్రం అందించారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కోర్టు సెంటర్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.
ములుగు కోర్టు ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టి పోలీసుల తీరుపై నినాదాలు చేశారు. నర్సంపేటలో విధు లను బహిష్కరించి రెడ్ రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. విధులు బహిషరించిన హనుమకొండ, వరంగల్ న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టా రు. అనంతరం అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ తీ శా రు. కార్యక్రమంలో వరంగల్, మానుకోట, పరకాల, ము లుగు, నర్సంపేట బార్ అసోసియేషన్ల అధ్యక్షులు తీ గల జీవన్ గౌడ్, కీసర పద్మాకర్ రెడ్డి, బందెల స్వామి, వినయ్‌కుమార్, పుట్టపాక రవి, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
జనగామ చౌరస్తా, ఆగస్టు 8 : జనగామ అర్బన్ సీఐ ఎల్ రఘుపతిరెడ్డితో పాటు ఎస్సై పీ తిరుపతిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ గురువారం సీపీ అంబర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కానిస్టేబుల్ బీ కరుణాకర్‌ను ఏఆర్‌కు అటాచ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, వరంగల్ సీసీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ దామోదర్‌రెడ్డిని జనగామ అర్బన్ సీఐగా నియమించారు.
ఈ నెల 5న జనగామ అర్బన్ పీఎస్‌లో ఓ కేసు విషయంలో వివాదం తలెత్తడంతో స్థానిక న్యాయవాదులైన అమృతరావు, కవిత దంపతులపై సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ కరుణాకర్ దాడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో బుధవారం సదరు పోలీసు అధికారులు, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. మూడు రోజులుగా పోలీసులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల నుంచి తీవ్రమైన నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో తాజాగా బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై సీపీ అంబర్ కిశోర్ ఝా బదిలీ వేటు వేశారు.