జఫర్‌గఢ్, జనవరి 9 : జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని కూనూరు జీపీ పరిధిలో నకిలీ రసీదులతో ఇంటి, నల్లా పన్నులు స్వాహా చేసిన కారోబార్‌పై ఎంపీడీవో సుమన్ గురువా రం విచారణ చేపట్టారు. గ్రామస్తుల సమక్షంలో నకిలీ రసీదులు, బుక్కులను పరిశీలించారు. కారోబార్ (మల్టీపర్పస్ వర్కర్) యాదనాల క్రాంతికుమార్‌పై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎంపీడీవో, గ్రామ ప్రత్యేకాధికారి సుమన్ విచారించి, వసూలు చేసిన పన్నులను జీపీ రికార్డుల్లో, ఎస్టీవో లో నమో దు చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు తే ల్చారు. రికార్డులను పూర్తిగా పరిశీలించి డబ్బులను రికవరీ చేస్తామని ఎంపీడీవో తెలిపారు. క్రాంతికుమార్‌ను విధుల నుంచి తొలగించినట్లు, తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు తెలుపనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గర్వందుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.