జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాతో డబుల్ గేమ్ ఆడుతున్నాడని బాధితురాలు కూరాకుల లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల క్రితం భూపాలపల్లి పట్టణంలోని మంజూర్ నగర్ కూరాకుల లలికు చెందిన బర్ల కొట్టాన్ని మున్సిపల్ అధికారులు కూలగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే చెబితేనే కూలగొట్టామని మున్సిపాలిటీ అధికారులు చెప్పడంతో కూరాకుల లలిత తన 20 బర్రెలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తోలిన విషయం విదితమే.
ఈ విషయమై న్యాయం చేస్తామని గత 20 రోజులుగా క్యాంపు కార్యాలయం చుట్టూ ఎమ్మెల్యే మమ్మల్ని తిప్పుకొని ఇప్పుడు మాట మారుస్తున్నాడని లలిత ఆరోపించారు. క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు చెబితేనే బర్లను తోలామని విలేకరుల సమావేశం పెట్టి చెప్పండి అప్పుడే న్యాయం చేస్తామని ఎమ్మెల్యే చెబుతున్నాడని బాధితురాలు లలిత తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులతో కూడా తనకు ప్రాణహాని ఉందన్నారు.