జనగామ రూరల్, ఏప్రిల్22 : బిఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా కార్యకర్తలకు కురువ సంఘం జిల్లా నాయకుడు, బిఆర్ఎస్ నాయకుడు బండ రాములు కండువాలు పంపిణీ చేశారు. శనివారం జనగామ మండలం పెంబర్తి గ్రామంలో 150 కండువాలు కార్యకర్తలకు వేసవి సందర్భంగా పంపిణీ చేశామని తెలిపారు. ఎవరు కూడా ఎండ వేడిమికి ఇబ్బందులు పడకుండా తట్టుకోవడానికి ఈ కండువాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కెసిఆర్ సభను విజయవంతం చేయుటకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బల్దే సిద్ధిలింగం, గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్నబోయిన నరసయ్య, నాయకులు పాశం రాజిరెడ్డి, బండ సత్తయ్య, గుజ్జుల సంపత్, ఆకుల శ్రవణ్, ఎండి రజాక్, బాలకృష్ణ, జహీర్, మల్లేశం, రవి, ప్రేమ్ సాగర్, రాజు, ఎల్లయ్య, శీను, బబ్లు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.