హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 16: వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో రెండురోజుల పాటు ఆన్లైన్ వేదికగా ‘మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్-2025’ అనే అంశంపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు పోస్టర్లను వీసీ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం ఆవిష్కరించారు. 2025 రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి విజేతల గౌరవార్థంగా నిర్వహించనున్న ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విషయనిపుణులు పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.
భారత కాలమాన ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 8.30 గంటల వరకు ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలు జరుగుతాయని కాలేజీ ప్రిన్సిపాల్ జి.పోశయ్య చెప్పారు. ఈ సదస్సుకు కన్వీనర్‌గా శ్రీనివాస్ వ్యవహరిస్తుండగా, ఎ.మధుసూదన్‌రెడ్డి, ఎం.రెడ్డప్ప కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. ఆసక్తిగల అధ్యాపకులు కాలేజీలో లేదా కన్వీనర్‌ను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకొని, పరిశోధనా పత్రాలను సమర్పించవచ్చని పోశయ్య తెలిపారు.