హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 6: ఈనెల 15 నుంచి 24 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం, మాలవియ మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.ఇ.పి ఒరియంటేషన్ అండ్ సెన్సిటైజేషన్ ఆన్లైన్ ప్రోగ్రాం పోస్టర్లు వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం ఆవిష్కరించారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్యులు గుర్ మహిందర్ సింగ్, విమల్ రార్హాతో పాటు కేయూ కంప్యూటర్ సైన్స్విభాగాధిపతి బి.రమ, విభాగ సహాయ ఆచార్యుడు డి.రమేష్ సంయోజకులుగా వ్యవహరించనున్నారు.
జాతీయస్థాయి నిపుణులు అకాడమిక్ లీడర్ షిప్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్టూడెంట్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ తదితర అంశాలపై ప్రతిరోజు ప్రత్యేక సేషన్లను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమానికి ఉన్నత విద్యాధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొనేందుకు www.kakatiya.ac.in. లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.