హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్నో కొత్త ప్రయోగాలకు నిలయముగా మారింది అందులో భాగంగా ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్అసోసియేషన్ ఏర్పాటు కూడా ఒక ముఖ్య ఘట్టంగా చెప్పవచ్చని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం అన్నారు. కేయూ రాజనీతిశాస్త్ర విభాగంలోని అల్మిని కమిటీ హాల్లో ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరిలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో రాజనీతి శాస్త్రానికి సంబంధించిన, సెమినార్లు వర్క్‌షాప్స్, డిబేట్స్ ద్వారా సమాజంలోని రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు భవిష్యత్తులో సమాజానికి అవసరమైన సూచనలు, సలహాలు చేసుకుంటూ సంస్థ మరింతగా ముందుకెళ్లాలని ఆశించారు.
రాజనీతిశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, రాజనీతిశాస్త్ర విభాగపు పాఠ్యప్రణాళిక సంఘం చైర్మన్ గడ్డం కృష్ణ, రాజనీతిశాస్త్రం విభాగ అధ్యాపకులు వడ్లకొండ సత్యనారాయణ, ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాడపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి పాలమాకుల కొమురయ్య, ఉపాధ్యక్షుడు సోమలింగం, సంయుక్త కార్యదర్శి నరేష్కుమార్, కోశాధికారి కల్లేపల్లి ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు శ్రావణ్‌కుమార్, గుండు సురేష్, లీలావతి, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.