హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (కో ఎడ్యుకేషన్)లో ఐటీ విభాగంలో బీటెక్ చదువుతున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ పడమటింటి సాయికుందన్ ( Saikundan ) నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ( National Inegration Camp ) లో పాల్గొనడానికి ఎంపికయ్యారు.
ఈ శిబిరం గుజరాత్లోని వల్లభ విద్యానగర్ సర్దార్ పటేల్ యూనివర్సిటీలో 22 నుంచి 28 వరకు జరుగనుంది. ఈ విశిష్ట అవకాశం లభించినందుకు ప్రిన్సిపాల్ ఎన్. రమణ, ఎన్ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.శైలజ, ఎం.సౌజన్య తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది సాయికుందన్కు అభినందనలు తెలిపారు.