KU Degree Semesters | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19: కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, అదనపు డైరెక్టర్లు డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్టర్ పి.వెంకటయ్య సంయుక్తంగా విడుదల చేశారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 15 వరకు, అపరాధ రుసుం రూ.50తో అక్టోబర్ 22 వరకు గడువు ఉన్నట్లు, మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.in చూడవచ్చని, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు గమనించాలని తెలిపారు.