వరంగల్ : జిల్లాలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యుతనేత మంత్రి కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులు రావడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.