గూడూరు, జులై 24 : బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మరుగుజ్జు యువకుడు కిరాణా షాపును ప్రారంభించాడు. గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెం దిన ధరావత్ వినోద్ డిగ్రీ చదివి నిరుద్యోగంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గత ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అ భ్యర్థుల కోసం గూడూరు మీదుగా మహబూబాబాద్ కు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ వెంట వచ్చాడు. గమనించిన ఆయన వినోద్‌ను పలకరించగా తాను ఆర్థికం గా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు.
దీంతో కేటీఆర్ రూ.2 లక్షలు ఇస్తానని, వాటితో కిరాణా షాపు పెట్టుకొని నడుపుకోవాలని సూచించారు. ఈ క్రమంలో గురువారం చెకు రూపంలో రూ.రెండు లక్షలను కాజీపేటలో గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా కేటీఆర్ అందించా రు. ఈ డబ్బులతో వినోద్ కిరాణానికి సంబంధించిన సామగ్రితో శుక్రవారం గ్రామంలోని ప్రధాన సెంటర్లో షాపును మాజీ సర్పంచ్ శైలజా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించుకున్నాడు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ తన జీవితానికి ఆధారమైన కేటీఆర్ సార్ పేరు నిలబెడతానని, ఆర్థికంగా నిలదొకుకొని అభివృద్ధి పథంలో సాగుతానని తెలిపారు.