వరంగల్, జూలై 1: వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రి అయిన కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మం గళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం లో ఉప ప్రధాన ఎన్నికల అధికారి హరిసింగ్‌కు బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ భరత్‌కుమార్, రాకేశ్‌తో కలిసి ఆయన ఫిర్యాదు అందచేశారు.
మంత్రి సురే ఖ భర్త కొండా మురళి ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశానని చెప్పడం రాజ్యాంగాన్ని అవమాన పర్చడమేన ని, ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని ఆయన అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశానని స్వయంగా మంత్రి సురేఖ భర్త మురళి చెప్పడం తీవ్రమైన అంశమని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలను ప్రలోభపెట్టడం, డబ్బుతో ఓట్లు కొనడం వంటి అంశాలకు సంకేతం అన్నారు. మురళి వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించి సురేఖను అనర్హురాలిగా ప్రకటించాలని కోరారు.