కరీమాబాద్, జూలై 6 : తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివా రం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురు మ కులస్తులు తమ ఇలవేల్పు బీరన్న స్వామికి తొలి బోనం సమర్పించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని ఉ ర్సు, కరీమాబాద్, రంగశాయిపేట, ఓసిటీ ప్రాం తంలో కుల సంఘాలు, ఆలయ కమిటీల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించా రు. ఉదయం ఉర్సులోని కురుమ కులసంఘం అధ్యక్షుడు యేర కోటేశ్వర్ ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టువస్ర్తాలు, బండారి, కంకణా లు సమర్పించారు. అనంతరం సాయంత్రం మహిళలు నెత్తిన బోనాలతో ఆలయానికి తరలివెళ్లారు.
దారి పొడవునా డప్పు చప్పుళ్ల నడుమ బీరన్నల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కురుమ కుల పెద్ద మరుపల్ల రవి ముందు సాగగా మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకొని స్వామి వారికి నైవే ద్యం సమర్పించారు. కరీమాబాద్‌లోని ఆలయ కమిటీ సభ్యులు ఉదయం ఆలయానికి వెళ్లి అక్కడి చెట్టుకు జాతీయ జెండా కట్టారు. సాయం త్రం కుల పెద్ద రామస్వామి ముందు రాగా బోనాలు బయలుదేరాయి. ఊరంతా తరలివచ్చి బోనాలను, బీరన్నల విన్యాసాలను ఆత్రంగా తిలకించింది.
బోనాలు బురుజు సెంటర్లోకి రాగానే బీరన్నలు గొర్రెను గావు పట్టారు. అనంతరం ఆ గొర్రె పిల్లను దాటుతూ మహిళలు ఆలయానికి చేరుకున్నారు. రాత్రి స్వామివారి కల్యాణం నిర్వహించిన తదుపరి ఇళ్లకు తిరిగివెళ్లారు. రంగశాయిపేట, ఓ సిటీలోనూ మహిళలు బోనాలు స మర్పించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బోనమెత్తారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప ల్లం పద్మ, గుండు చందన, మాజీ కార్పొరేటర్లు మేడిది రజిత, కేడల పద్మ, నాగపురి కల్పన, బత్తిని వసుంధర, కత్తెరశాల కుమారస్వామి, బాసాని శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, కురుమలు పాల్గొన్నారు.