బచ్చన్నపేట జూన్ 9 : అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని డిసిసి అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోచన్నపేట, చిన్న రామంచర్ల, బచ్చన్నపేట, ఆలింపూర్ తదితర గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
గోపాల్ నగర్ లో ఇండ్ల పైనుంచి వెళ్లిన విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కొడవటూరు సిద్దుల గుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, నాయకులు జంగిటి విద్యానాథ్, ఎండీడి మసూద్, నల్లనాగుల వెంకటాచారి, జ్యోతి భాస్కర్, పాకాల కర్ణాకర్, రాములు, పరమేష్, శ్రీనివాస్, హరీష్, చెరుకూరి శ్రీనివాస్, ఎల్లయ్య, రవీందర్ రెడ్డి, బాపురెడ్డి, జ్యోతి బైరయ్య, తదితరులు పాల్గొన్నారు.