వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 11 : కాకతీయ మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వసూళ్ల దందా ‘మూడు పువ్వు లు.. ఆరు కాయలు’ చందంగా కొనసాగుతున్నది. ఒక్కో సేవకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ రోగుల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దండుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో కా ర్డియాలజీ, కార్డియోథొరాసిస్ అండ్ వస్క్యులర్ సర్జరీ (సీటీవీఎస్), గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, న్యూ రాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో సానిటేషన్ కో సం 40మంది, పేషెంట్ కేర్‌కు 43, పర్యవేక్షణ సూపర్వైజర్లు ఏడుగురు విధులు నిర్వర్తిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు పేదలు అధిక సంఖ్యలో వస్తుండడంతో ఓపీ రిజిస్ట్రేషన్ వద్ద ఎక్కువ మంది క్యూలో నిల్చుంటున్నారు. పైగా కౌంటర్లు తక్కువగా ఉండడంతో ఓపీ రిజిస్ట్రేషన్‌కు సమయం పడుతున్నది. దీనిని ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నారు. డాక్టర్లు ఎక్కువ సమయం ఉండరని, తమకు డబ్బులిస్తే ఓపీ రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు నేరుగా డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని రోగులు, అటెండెంట్లను మభ్యపెట్టి అ క్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏవైనా టెస్టులు అవసరముంటే అందుకోసం అదనంగా సమర్పించుకోవాల్సిందే.
ఇదిలా ఉం డగా పర్యవేక్షణ సూపర్వైజర్లు సైతం తామే మీ తక్కువ కాదన్నట్లు సానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బందికి నచ్చిన విభాగంలో విధులు కేటాయించేందుకు నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో పదిహేను రోజులకొకసారి డ్యూటీలు, షిఫ్ట్‌ల్లో మార్పులుండగా, ప్ర స్తుతం వాటిని నెల రోజులకొకసారి మార్పు చేస్తున్నారు. దీంతో నచ్చిన విభాగంలో డ్యూ టీ, షిఫ్ట్ వేయించుకోవడానికి డబ్బులిచ్చిన ఔట్సోర్సింగ్ సిబ్బంది పేషెంట్, అటెండెంట్ల నుంచి వసూలు చేస్తున్నారు. పైగా ప్రశ్నించిన తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని అటెండెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉచిత వైద్యం కోసమ ని వచ్చిన తాము ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సి వస్తున్నదని ఆ వేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారు లు స్పందించి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వసూ ళ్ల దందాకు చెక్‌పెట్టి రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని ప్రజలు కోరుతున్నారు.