కరీమాబాద్, అక్టోబర్ 30 : వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో నరకాసురవధను ఘనంగా నిర్వహించారు. 58 అడుగుల భారీ ప్రతిమను పటాకులతో దహ నం చేయగా, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అంతకుముందు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పల్లం పద్మ, భద్రకాళీ ఆలయ ప్రధాన అర్చకుడు శేషు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను కమిటీ సభ్యులు సత్కరించారు.