భీమదేవరపల్లి, జనవరి 05 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని కొత్తకొండ గ్రామంలో సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులుగా గద్ద కుమారస్వామి, బోయిని మహేష్, గజ్జల సృజన, ప్రధాన కార్యదర్శిగా శిక ప్రదీప్, సంయుక్త కార్యదర్శి నేతుల చంద్ర మోహన్, కార్యదర్శులుగా బొల్లంపల్లి అజయ్ కుమార్, కొర్ర గోపాల్, వంగ తిరుమల, మండల రజిత, కోశాధికారి డప్పు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా గడ్డం సుజాత, ఊరడి భారతి, గూడెల్లి కల్పన, భూక్య సునిత, ముద్దసాని మమత, సిద్దమల్ల రమ, మ్యాకల వెంకన్న, బొల్లి మానస, గోపగాని తిరుపతి ఎన్నికయ్యారు.