హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 12: తెలంగాణ తొ లి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోనే గొప్ప నా యకుడని, రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీని బుధవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేసి వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చారని.. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, నగదు బహుమతులు, ఇంటి స్థలాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను బలోపేతం చేసేందుకు గత బీఆర్ఎస్ హ యాంలో క్రీడామైదానాలను సైతం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారని, వారందరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దాస్యం వినయ్‌భాసర్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలను కొన్నేళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్రీడాకారులను ఈ పోటీల ద్వారా ప్రోత్సాహం అందించినట్లవుతుందని కొనియాడారు.
తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను ఉద్యమనేత, తొలి సీఎం కేసీఆర్ నెరవేర్చారని, వారి జన్మదినాన్ని పురసరించుకుని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని దాస్యం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఏటా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఓరుగల్లు క్రికెట్ క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు కాకతీయ క్రికెట్ అకాడమీతో కలిసి కేసీఆర్ క్రికెట్ కప్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యమిచ్చామన్నారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్భాసర్, బోయినపల్లి రంజిత్‌రావు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్ పాల్గొన్నారు.