హనుమకొండ, నవంబర్ 23 : దళితులను వ్యక్తి గతంగా దూషించి, ముఖం చాటేసి రాజకీయాలు చేస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే డప్పుచప్పుళ్లతో శవయాత్రగా ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకుడు, 4వ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్‌కుమార్ హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ చౌరస్తాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో అసలైన నాయకులను గుర్తించాలని, దళితులను అవమానపరిచి బోడ డిన్నాతో సమావేశం పెట్టించడం సరైంది కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులకు కూడా ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దళితులను వ్యక్తిగతంగా దూషించిన వారికి మద్దతు ఇస్తూ ఎమ్మెల్యే రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. 24 గంటల్లో ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే శవయాత్ర తప్పదని మనోజ్‌కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షుడు బొళ్లపల్లి పున్నంచందర్, పండుగ సాగర్, ముల ప్రభాకర్, భార్గవ్ పాల్గొన్నారు.