కాళేశ్వరం : పవిత్ర పూణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో కార్తీక మాసన్ని పురస్కరించుకుని మూడవ రోజు బుధవారం కార్తీక త్రయోదశి రోజున ఆలయ అధికారులు, అర్చకులు గోదావరిలో హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరికి పంచహారతి, కుంబహారతి ఇచ్చారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకోని పూజలు చేసి గోదావరిలో దీపాలు వదిలారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మమత, ఆలయ సీనియర్ సహాయకులు ఉమమహేశ్వర్ తదితరులు ఉన్నారు.