కుడా బిగ్‌ప్లాన్!
నగర నడిబొడ్డున ఉన్న విలువైన కమర్షియల్ ల్యాండ్ విక్రయానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ బిగ్ ప్లాన్ వేసింది. బాలసముద్రంలోని విలువైన భూ మిని విక్రయిస్తే అడ్డుకుంటామని గతంలో పలు పార్టీల హె చ్చరికల నేపథ్యంలో అధికారులు వెనకడుగు వేశారు. అయి తే, ఈ సారి పక్కాప్లాన్‌తో బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లోని విలువైన భూమిని విక్రయించేందుకు స్కేచ్ వేశా రు.
- బాలసముద్రంలోని విలువైన ల్యాండ్ విక్రయానికి స్కెచ్
- ఓ సిటీ, యునిసిటీ ప్లాట్లతో కలిపి అమ్మాలని నిర్ణయం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న పార్టీలు
వరంగల్, జూన్ 12 : నగర నడిబొడ్డున ఉన్న విలువైన కమర్షియల్ ల్యాండ్ విక్రయానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ బిగ్ ప్లాన్ వేసింది. బాలసముద్రంలోని విలువైన భూ మిని విక్రయిస్తే అడ్డుకుంటామని గతంలో పలు పార్టీల హె చ్చరికల నేపథ్యంలో అధికారులు వెనకడుగు వేశారు. అయి తే, ఈ సారి పక్కాప్లాన్‌తో బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లోని విలువైన భూమిని విక్రయించేందుకు స్కేచ్ వేశా రు.
ఒక్క బాలసముద్రంలోని విలువైన కమర్షియల్ ల్యాండ్ కు మాత్రమే వేలం పెడితే రచ్చ అవుతుందని భావించిన కు డా అధికారులు, మరో మూడు వెంచర్ల ప్లాట్ల వేలంతో కలిపి విక్రయించేందుకు ప్లాన్ వేశారు. వరంగల్ ఆజంజాహీ మిల్లు భూముల్లోని ఓ సిటీ, ఉనికిచర్లలోని యుని సిటీ, అంబేద్కర్ భవన్ పక్కన అపార్ట్మెంట్లోని ప్లాట్లతో కలిపి బాలసముద్రంలోని విలువైన కమర్షియల్ ల్యాండ్ వేలం వేసేలా ప్రణాళికలు రూపొదించారు. అయితే, ఎక్కడా హడావుడి చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా నగరంలో ఒకటి, రెండు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాలసముద్రంలోని విలువైన కమర్షియల్ ల్యాండ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలపై పలు పార్టీలు మండిపడుతున్నాయి.
బాలసముద్రంలోని భూమి అమ్మకాన్ని అడ్డుకుంటామని హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాన్ని కుడా కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ వేశారు. ప్లాట్ల విక్రయ వేలాన్ని ఏనాడు కుడా కార్యాలయంలో జరపని అధికారులు ఈ సారి మాత్రం అక్కడే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న బాలసముద్రంలోని 8 కమర్షియల్ ప్లాట్ల వేలంతోపాటు అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని ఖాళీ 3 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. జూన్ 25వ తేదీన ఓ సిటీలోని 45 రెసిడెన్సియల్ ప్లాట్లతోపాటు 5 కమర్షియల్ ప్లాట్లకు వేలం వేయనున్నారు. జూన్ 28న ఉనికిచర్లలోని యునిసిటీలో 40 రెసిడెన్సియల్ ప్లాట్లకు వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

