నయీంనగర్, జనవరి 11: భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్‌భవన్ నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ జీ20 లోగో పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బహుమతులు పొందినట్లు నోడల్ ఆఫీసర్ కనకరత్నం తెలిపారు.
వక్తృత్వ పోటీల్లో (ఊర్దూ మీడియంలో) మొదటి ప్రైజ్ హాసం రాజక్ (యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీ), సెకండ్ ప్రైజ్ (ఇంగ్లిష్ మీడియంలో) క్రుతికా ప్రియాచందన్ (మహిళా ఇంజినీరింగ్ కాలేజీ సీఎస్ఈ అండ్ ఐటీ డిపార్ట్మెంట్), థర్డ్ ప్రైజ్ (తెలుగు మీడియంలో) చాముండేశ్వరి (ఖమ్మం సరస్వతి డిగ్రీ కాలేజీ), వ్యాసరచన పోటీల్లో తెలుగు మీడియంలో అంజలిదేవి (విశ్వవిద్యాలయ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ), ఇంగ్లిష్ మీడియంలో ధరణి (డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, యూనివర్సిటీ కాలేజి), హిందీ మీడియంలో జయిదా తస్లీం (కాకతీయ డిగ్రీ కాలేజీ హనుమకొండ), ఉర్థూ మీడియంలో సయ్యద్ ఫర్హిన్, షైక్ అసమా సుల్తానా (ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ ఖమ్మం) విజేతలుగా నిలిచారు. వీరికి జ్ఞాపికతోపాటు సర్టిఫికెట్, నగదు పారితోషికాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి అందుకున్నారు. వీరిని కేయూ వీసీ రమేశ్ అభినందించారు.