వరంగల్ చౌరస్తా, ఆగస్టు 17 : కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించి, ప్రాణం పోసే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్, సీనియర్ వైద్యులు రోడ్లపై ర్యాలీలు,
రాస్తారోకోలు చేయగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్, ఐఎంఏ, తెలంగాణ ఆప్తమాలజీ అసోసియేషన్ సభ్యులు, సీకేఎం వైద్యశాల డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేఎంసీ, ఎంజీఎం ప్రధాన కూడలిలో పెద్దపెట్టున నినాదాలు చేశారు.